ప్రపంచ ప్రఖ్యాత గాలె క్రికెట్ స్టేడియాన్ని కూల్చివేయనున్న శ్రీలంక!
- స్టేడియం పెవిలియన్తో డచ్ కోటకు ముప్పు
- యునెస్కో గుర్తింపును వదులుకోవడాన్ని ఇష్టపడని ప్రభుత్వం
- స్టేడియం కూల్చివేతకు రంగం సిద్ధం
ప్రభుత్వం గాలెలో మరో స్టేడియంను నిర్మించనున్నట్టు మంత్రి తెలిపారు. 2004లో సునామీ కారణంగా స్టేడియం చాలా వరకు ధ్వంసమైంది. దీంతో పునరుద్ధరణ పనుల్లో భాగంగా 2008లో పెవిలియన్ నిర్మించారు. ఇప్పుడు అదే స్టేడియం కూల్చివేతకు కారణం అవుతోంది. ఈ పెవిలియన్ కోటకు ముప్పుగా మారిందని ప్రభుత్వం తెలిపింది.
గాలె స్టేడియం స్పిన్నర్లకు స్వర్గధామం. 1998 నుంచి ఇప్పటి వరకు ఈ స్టేడియంలో ఆడిన మ్యాచుల్లో అత్యధిక శాతం మ్యాచులను శ్రీలంక గెలుచుకుంది. గత వారం కూడా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగానే 278 పరుగుల భారీ తేడాతో శ్రీలంక గెలిచింది. అయితే, స్టేడియాన్ని ఇప్పటికిప్పుడు కూల్చబోమని క్రీడల మంత్రి ఫెయిస్జెర్ ముస్తాఫా తెలిపారు.
ఇకపోతే, 1505లో శ్రీలంకకు వలస వచ్చిన పోర్చుగీసువారు ఈ కోటను నిర్మించారు. 1796లో ఈ కోటను బ్రిటిషర్లు స్వాధీనం చేసుకున్నారు.