Nara Lokesh: మనం వేసిన రోడ్లపై దొంగబ్బాయి నడుస్తున్నాడు!: మంత్రి నారా లోకేష్

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేష్ విమర్శలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండలో ఈరోజు నిర్వహించిన ‘గ్రామదర్శిని’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, ‘మనం వేసిన రోడ్లపై దొంగబ్బాయి నడుస్తున్నాడు. తనపై ఎన్నో కేసులున్నా చంద్రబాబును విమర్శిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీని మాత్రం జగన్ ప్రశ్నించరు. రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీలు ఎక్కడా కనబడడం లేదు’ అని విమర్శించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఆయన మాట్లాడారు. ఏపీలో డెబ్బై ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగిందని, రాష్ట్రంలో 50 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నామని, నిరుద్యోగులకు వచ్చే నెల నుంచి వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఎన్నికల లోపు ప్రతి ఇంటికీ మంచినీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని, అందరి సహకారముంటే నెలలోగా అండర్ డ్రెయిన్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. 
Go Back to Shorts
Nara Lokesh
Jagan

More Telugu News