Cricket: మా ఆవిడ గ్యాలరీలో ఉంటేనే నేను సెంచరీ చేస్తానంటారు.. మరిప్పుడు?: రోహిత్‌ శర్మ

ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్‌ రోహిత్ శర్మ అజేయ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. ఆయన కొట్టే షాట్లకు ఫిదా అయిపోతోన్న అభిమానులు ఆయనను రో'హిట్‌', హిట్‌మ్యాన్‌ అని కూడా పిలుచుకుంటున్నారు. రోహిత్‌ సహచర ఆటగాళ్లు కూడా 'హిట్‌ మ్యాన్‌' అని అంటుంటారు. దీనిపై స్పందించిన ఆయన... తనను చాలా మంది ‘హిట్‌ మ్యాన్‌’ అని ముద్దుగా పిలుచుకుంటారని, ఈ పేరంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు.          

కాగా, టీ20ల్లో ఇప్పటి వరకు తాను మూడు శతకాలు సాధించానని, తనకు ఈ మూడు చాలా ప్రత్యేకమని చెప్పాడు. తన భార్య రితిక.. గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ చూస్తున్న సమయంలోనే తాను శతకం సాధిస్తానని కొందరు అనుకుంటారని, కానీ, ఆమె ప్రస్తుతం ఇంగ్లండ్‌లో లేదని అన్నాడు. కొన్ని రోజుల్లో ఆమె ఇక్కడికి వస్తుందని, ఆమె కోసం ఎదురుచూస్తున్నానని చెప్పాడు.
Cricket
Rohit Sharma

More Telugu News