నేడు ధోనీ బర్త్‌డే.. మాజీ సారథి ఖాతాలో మరో అరుదైన రికార్డు
- నేటితో 37వ పడిలోకి ధోనీ
- 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మూడో ఇండియన్
- ఐసీసీ నిర్వహించిన మూడు ట్రోఫీలను గెలుచుకున్న రికార్డు
నేటితో 37వ వసంతంలోకి అడుగుపెడుతున్న ధోనీ ఖాతాలో మరెన్నో అరుదైన రికార్డులున్నాయి. ఐసీసీ నిర్వహించిన మూడు టోర్నీలు సాధించిన ఏకైక కెప్టెన్ ధోనీయే. 2007లో ఐసీసీ వరల్డ్ టీ20 ప్రారంభ టోర్నీ, 2011లో ప్రపంచకప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా ధోని ప్రపంచ రికార్డు సృష్టించాడు.