జగన్ ని కలిసిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి

  • అక్రమాస్తుల కేసు విచారణ అనంతరం తూ.గో.జిల్లాకు జగన్
  • శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో జగన్ ని కలిసిన ఆనం
  • దాదాపు పది నిమిషాల పాటు మాట్లాడుకున్న నేతలు
వైసీపీ అధినేత జగన్ ని మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి కలిశారు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్న వీరిద్దరూ దాదాపు పది నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. కాగా, వైసీపీలో ఆనం చేరతారన్న వార్తల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా, అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం ఈరోజు నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్ హాజరయ్యారు. అనంతరం తిరిగి పాదయాత్రను కొనసాగించడానికి ఆయన తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లారు.
Jagan
aanam

More Telugu News