హైదరాబాద్, కృష్ణానగర్ లో భారీ అగ్ని ప్రమాదం
- నాలుగంతస్తుల భవంతిలో మంటలు
- షార్ట్ సర్క్యూట్ కారణంగానే
- అదుపు చేసిన ఆరు ఫైరింజన్లు
స్టోర్ లో రంగులు, రసాయనాలు అధికంగా ఉండటంతో మంటలు అంత తొందరగా అదుపులోకి రాలేదు. భవంతిలోని వారందరినీ ఖాళీ చేయించిన అధికారులు, క్రేన్ సాయంతో గోడలను పగులగొట్టి, కరెంట్ సరఫరా నిలిపివేయించి, లోపలికి నీరు చిమ్మారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను కూడా ఖాళీ చేయించారు. ఈ ఘటనలో సుమారు రూ. 25 లక్షల మేరకు ఆస్తి నష్టం కలిగివుండవచ్చని స్టోర్ యాజమాన్యం అంచనా వేసింది. కరెంట్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.