ఈ సినిమా ఆడుతుందా అనుకున్నాం .. సూపర్ హిట్ అయింది!: అలీ
- ఈవీవీ గారు మాతో లేడీ గెటప్స్ వేయించారు
- ఏంట్రా బాబూ ఈ గోల అనుకున్నాం
- ప్రతి ఆర్టిస్ట్ కి పదివేలు ఇచ్చారు
సినిమా డబ్బింగ్ చెప్పేశాము .. చెన్నైలో ఒక షో వేశారు .. ఏంటి ఈ సినిమా విచిత్రంగా వుంది .. ఆడుతుందా? అనుకున్నాం. సినిమా రిలీజ్ అయిన తరువాత సూపర్ హిట్ అయింది .. మేమందరం ఆశ్చర్యపోయాం. చెన్నైలో 100 రోజుల ఫంక్షన్లో ఈవీవీ గారు మాట్లాడుతూ .. ఆర్టిస్టులు తమ పాత్రలకు న్యాయం చేయడం వల్లనే ఈ సినిమా ఈ స్థాయిలో ఆడిందని మెచ్చుకున్నారు. అవార్డుతో పాటు ఆయన సొంత డబ్బులో నుంచి ప్రతి ఆర్టిస్ట్ కి పదివేల రూపాయల చొప్పున ఇచ్చారు" అని చెప్పుకొచ్చారు.