BJP: ఇద్దరమూ ఒకే కారులో వెళ్లి హోటల్‌లో భోజనం చేశాం: వైసీపీ ఎమ్మెల్యేతో వీడియోపై ఆకుల స్పందన

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీలో నిన్న బీజేపీ నేత ఆకుల సత్యనారాయణతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి భేటీ అయినట్లు ఓ వీడియో హల్‌చల్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆకుల సత్యనారాయణ స్పందించారు. ఏపీ భవన్‌లో తనకు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కలిశారని, ఇద్దరమూ ఒకే కారులో వెళ్లి హోటల్‌లో భోజనం చేసి వచ్చామని అన్నారు. తాను వైసీపీ నేతలను బీజేపీ అగ్రనేతల వద్దకు తీసుకెళ్లానని జరుగుతోన్న ప్రచారం అసత్యమని అన్నారు. టీడీపీ నేతలు చేస్తోన్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని సవాలు చేశారు. కుట్ర రాజకీయాలు చేస్తున్నారని తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు.
Go Back to Shorts
BJP
YSRCP
akula

More Telugu News