తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత్‌ 347/6

  • బెంగళూరులో ఆఫ్గనిస్థాన్‌తో ఏకైక టెస్టు
  • ధావన్‌ 107, మురళీ విజయ్‌ 105 పరుగులు
  • రాహుల్‌ 54, పుజారా 34, రహానె 10 రన్స్‌
  • క్రీజులో హార్దిక్‌ పాండ్య (10), రవిచంద్రన్‌ అశ్విన్‌ (7)
బెంగళూరులో ఆఫ్గనిస్థాన్‌తో జరుగుతోన్న ఏకైక టెస్టు మ్యాచులో టాస్‌ గెలిచిన భారత్‌ మొదట బ్యాటింగ్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. తొలి రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 347 (78 ఓవర్లు) పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో శిఖర్‌ ధావన్‌ (107), మురళీ విజయ్‌ (105) సెంచరీలతో చెలరేగారు. రాహుల్‌ 54, పుజారా 34, రహానె 10 పరుగులు చేసి ఔటయ్యారు. క్రీజులో హార్దిక్‌ పాండ్య 10, రవిచంద్రన్‌ అశ్విన్‌ 7 ఉన్నారు. ఆఫ్గానిస్థాన్‌ బౌలర్లలో అహ్మద్‌ జాయ్‌ 2 వికెట్లు పడగొట్టగా, రషీద్‌ ఖాన్‌, వఫాదర్‌, ముజీబ్‌ చెరో వికెట్ తీశారు. తొలిరోజు ఎక్స్‌ట్రాల రూపంలో టీమిండియాకు 15 పరుగులు వచ్చాయి.     
Go Back to Shorts
India
afganistan
Cricket

More Telugu News