పొట్ట నింపుకోవడానికి అన్య మతస్తుడైన జగన్ ఇంటికే వెళ్లాలా?: రమణ దీక్షితులుపై బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఫైర్
- బంగారాన్ని ముంబైకి తరలించి 40 శాతం తరుగు చూపించారు
- అర్చకులను వేధించిన ఘనత ఆయనది
- కుట్ర రాజకీయాలకు సహకరిస్తే.. బ్రాహ్మణులే బుద్ధి చెబుతారు
సంపంగి ప్రాకారంలోని వంటశాలలో నైవేద్యం చేయవచ్చని రమణ దీక్షితులు లేఖ ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. అర్ధరాత్రి, మిట్ట మధ్యాహ్నం డ్యూటీలతో అర్చకులను వేధించిన ఘనత రమణ దీక్షితులుదని మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న కుట్ర రాజకీయాల్లో భాగస్వామిగా మారి... రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు సహకరిస్తే బ్రాహ్మణులే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పొట్ట నింపుకోవడానికి అన్యమతస్తుడైన వైసీపీ అధినేత జగన్ ఇంటికే వెళ్లాలా? అంటూ మండిపడ్డారు.