అనుష్క శర్మతో కలిసి వ్యాయామం చేసి.. అభిమానులను ఖుషీ చేసిన కోహ్లీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనుష్క శర్మతో కలిసి వ్యాయామం చేసి.. అభిమానులను ఖుషీ చేసిన కోహ్లీ

  • ఇటీవల కోహ్లీ ఫ్యామిలీ ఫొటోలో అనుష్క శర్మ మిస్సింగ్‌
  • తాజాగా తన శ్రీమతితో సెల్ఫీ వీడియో తీసుకున్న కోహ్లీ
  • తనతో ఎవరు ఉన్నారో చూడండంటూ వ్యాఖ్య
టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఫ్యామిలీ ఫొటోలో అనుష్క శర్మ మిస్సింగ్‌ అంటూ ఇటీవల ఆయన ఫ్యాన్స్‌ తెగ హడావుడి చేసిన విషయం తెలిసిందే. కోహ్లీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్‌ చేస్తూ సెల్ఫీ తీసుకుని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అయితే, ఆ ఫొటోలో ఆయన తల్లి, సోదరి, ఆమె పిల్లలు మాత్రమే ఉండి ఆయన భార్య, సినీనటి అనుష్క శర్మ లేకపోవడంతో ఆమె ఎక్కడ? అంటూ అభిమానులు ప్రశ్నలు వేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా, అనుష్క శర్మతో కలిసి జిమ్‌లో వ్యాయామం చేస్తూ సెల్ఫీ వీడియోను తీసుకున్న కోహ్లీ.. తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి అభిమానులను ఖుషీ చేశాడు. తన సామర్థ్యాన్ని పెంచుకునే క్రమంలో మరో ట్రైనింగ్‌ సెషన్‌లో పాల్గొన్నానని పేర్కొన్నాడు. తనతో పాటు ఎవరు ఉన్నారో చూడండంటూ అనుష్క శర్మను చూపిస్తూ అలరించాడు. తన భార్య తన కంటే ఎక్కువగా వ్యాయామం చేస్తోందని, ఆమె స్ట్రాంగ్‌ అని అన్నాడు.
Anushka Sharma
Virat Kohli
Cricket

More Telugu News