సచిన్ సూపర్ ఫ్యాన్ కు మరువలేని అనుభూతిని మిగిల్చిన ధోనీ!
- సచిన్ కు వీరాభిమాని సుధీర్ గౌతమ్
- సుధీర్ ను ఇంటికి ఆహ్వానించి విందు ఇచ్చిన ధోనీ
- మరువలేని క్షణాలంటూ సుధీర్ ఆనందం
సచిన్ క్రికెట్ నుంచి రిటైర్ అయినా కూడా, సుధీర్ భారత జట్టు ఆడే ఆటలకు వెళ్లి ఆటగాళ్లను ఉత్సాహపరుస్తుంటాడు. ఈ నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోనీ, సుధీర్ కు మరపురాని అనుభూతిని మిగిల్చేలా, తన ఇంటికి పిలిచి విందు ఇచ్చాడు. ధోనీ తనను పిలవడంతో ఎంతో ఆనందపడిన సుధీర్, ఆయనింటికి వెళ్లి ధోనీ, సాక్షిలతో కలసి విందారగించి వచ్చాడు. ఆ క్షణాలను మాటలతో వర్ణించలేనని చెబుతూ, ధోనీ కుటుంబీకులకు కృతజ్ఞతలు చెప్పాడు.