పదో తరగతి పరీక్షల్లో 97 శాతం మార్కులు తెచ్చుకున్న ఒడియా సినీ హీరోయిన్!
- మంగళవారం నాడు విడుదలైన సీబీఎస్ఈ ఫలితాలు
- ఒడియా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న భూమిక దాస్
- భువనేశ్వర్ లోని డీఏవీలో చదువుతున్న భూమిక
2003 జూన్ 22న జన్మించిన భూమిక దాస్ కు ప్రస్తుతం 15 సంవత్సరాలు నిండాయి. 2014లో బాలనటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన భూమిక, 'రుంకు జుమానా' చిత్రానికి గాను, ఉత్తమ బాలనటిగా అవార్డును పొందింది. 9వ తరగతి చదువుతున్న సమయంలోనే 'తుమో లవ్ స్టోరీ' అనే సినిమాలో హీరోయిన్ గా చాన్స్ కొట్టేసి, ఆపై 'హీరో నెంబర్ వన్' తదితర చిత్రాల్లో నటించింది.