పెళ్లి కుదిరిందంటూ ప్రచారం .. స్పందించిన త్రిష
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి కుదిరిందంటూ ప్రచారం .. స్పందించిన త్రిష

  • ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు 
  • ప్రేమ వివాహమే చేసుకుంటాను 
  • నచ్చిన వ్యక్తి ఇంకా తారసపడలేదు
తెలుగు .. తమిళ భాషల్లో త్రిష అగ్ర కథానాయిక అనిపించుకుంది. సుదీర్ఘ కాలంపాటు ఈ రెండు భాషల్లో తన హవాను కొనసాగించిన త్రిష, ప్రస్తుతం మలయాళ సినిమాలతో బిజీగా వుంది. ఆ మధ్య త్రిషకి వరుణ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం జరగడం .. ఆ తరువాత కొన్ని కారణాలతో అది రద్దు కావడం జరిగింది. ఇక ఈ మధ్యకాలంలో తమిళనాడుకి చెందిన ఒక బిజినెస్ మేన్ తో త్రిషకి ప్రేమ వ్యవహారం నడుస్తోందనే వార్తలు వచ్చాయి.

 ఆయనను పెళ్లి చేసుకోవాలని ఆమె నిర్ణయించుకుందనీ, అందుకోసం భారీస్థాయిలో షాపింగ్ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయాన్ని గురించి త్రిష స్పందించింది. కొంతకాలంగా నా పెళ్లి గురించి జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. ఇంకా నేను పెళ్లి గురించిన ఆలోచన చేయడం లేదు. ప్రేమ వివాహమే చేసుకుంటాను .. అయితే ఇంతవరకూ మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడలేదు. అదే జరిగితే అందరికీ నేనే స్వయంగా చెబుతాను" అంటూ స్పష్టం చేసింది.   
trisha

More Telugu News