కేసీఆర్ ది థర్డ్ ఫ్రంట్ కాదు.. ఫ్యామిలీ ఫ్రంట్!: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్ ది థర్డ్ ఫ్రంట్ కాదు.. ఫ్యామిలీ ఫ్రంట్!: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు

  • 2014లో ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు
  • ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమయ్యారు
  • కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. థర్డ్ ఫ్రంట్ గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారని...అయితే, ఆయనది ఫ్యామిలీ ఫ్రంట్ అని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు. గత నాలుగేళ్ల కాలంలో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కేసీఆర్... కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్... ఈ నాలుగేళ్లలో ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుటుంబ రాజకీయాల్లో బిజీగా ఉన్నాయని దుయ్యబట్టారు.
KCR
lakshman
BJP
Congress

More Telugu News