jena sena: బాబాయ్ ఏమడిగితే అది చేస్తాను: హీరో రామ్ చరణ్
జనసేన పార్టీ తరపున ప్రచారం చేసేందుకు తాను సిద్ధమని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటున్నాడు. బ్యాంకాక్ నుంచి తిరిగొచ్చిన రామ్ చరణ్ ను హైదరాబాద్ లో మీడియా పలకరించింది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో పవన్ కల్యాణ్ కష్టపడుతుండటం చూస్తుంటే బాధగానే ఉంది కానీ, ప్రజల కోసం పర్యటిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. చరణ్ తో మీడియా జరిపిన సంభాషణ.
* శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న మీ బాబాయ్.. ఎండల్లో తిరుగుతూ బాగా కష్టపడుతుంటే మీకు ఎలా అనిపిస్తోంది?’
రామ్ చరణ్: ప్రజలు ఎంతగా బాధపడుతున్నారనే విషయాన్ని ఆయన గుర్తించారు. ప్రజల బాగు కోసం ఆయన వెళుతున్నారు కనుక మనం ప్రోత్సహించాలే తప్ప బాధపడకూడదు.
* ఒకవేళ ప్రచారానికి రమ్మనమని పవన్ కల్యాణ్ చెబితే మీరు వెళ్తారా?
రామ్ చరణ్ : ఆయన ఏమడిగితే అది చేస్తాను
* ప్రచారం చేస్తానని మీరేమైనా అడిగారా?
రామ్ చరణ్ : లేదు