కోహ్లీ ఛాలెంజ్ స్వీకరించారు.. మరి మా ఛాలెంజ్ కూడా స్వీకరించండి, మోదీ సార్: తేజస్వి యాదవ్
- మోదీకి ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరిన కోహ్లీ
- త్వరలోనే తన ఫిట్ నెస్ వీడియోను పోస్ట్ చేస్తానన్న మోదీ
- సమస్యలపై ఛాలెంజ్ ను స్వీకరిస్తారా? అని ప్రశ్నించిన తేజస్వి
విరాట్ కోహ్లీకి కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ట్విట్టర్ ద్వారా ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన కోహ్లీ... జిమ్ లో తాను చేస్తున్న వర్కవుట్స్ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ తర్వాత తన ఫిట్ నెస్ ఛాలెంజ్ ను స్వీకరించాలంటూ ప్రధాని మోదీ, తన భార్య అనుష్క, క్రికెటర్ ధోనీలను కోరాడు. కోహ్లీ ఛాలెంజ్ ను స్వీకరించిన మోదీ... త్వరలోనే తన ఫిట్ నెస్ వీడియోను పోస్ట్ చేస్తానని పేర్కొన్నారు.