అమిత్ షా కాన్వాయ్ పై దాడి ఉద్దేశపూర్వకంగా జరిగిందే: మాణిక్యాలరావు ఆరోపణ
- మా కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారు
- ప్రశ్నించిన ప్రతి వ్యక్తికి బీజేపీతో సంబంధాలు పెడుతున్నారు
- టీటీడీలో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి
అమిత్ షాకు రక్షణగా ఉన్న తమ కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని, ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి వ్యక్తికి బీజేపీతో సంబంధాలు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ప్రస్తుత పరిణామాల గురించి ఆయన ప్రస్తావించారు. టీటీడీలో అక్రమాలు జరిగిన విషయాన్ని చెబుతుంటే ఎదురుదాడికి దిగుతున్నారని, ఈ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని మాణిక్యాలరావు డిమాండ్ చేశారు.