అక్కినేని చేసిన సత్కారం ఎప్పటికీ మరిచిపోలేను: అలీ
Add ap7am to your home Screen

అక్కినేని చేసిన సత్కారం ఎప్పటికీ మరిచిపోలేను: అలీ

  • ఆ రోజున అక్కినేని జన్మదినం 
  • ఆయన నుంచి ఆహ్వానం వచ్చింది 
  • రవీంద్రభారతిలో సత్కరించారు      
హాస్య నటుడిగా అలీ అంచెలంచలుగా ఎదుగుతూ వచ్చాడు. ఇండస్ట్రీలోని పెద్దలతోను .. పిన్నలతోను ఆయన ఎంతో కలివిడిగా ఉంటాడు. అందువలన చాలామంది ఆయనను అభిమానిస్తూ వుంటారు. అలాంటి అలీ తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు.

" జీవితంలో నేను ఎప్పటికీ మరిచిపోలేని సంఘటన ఒకటి వుంది. తన జన్మదినం సందర్భంగా కొంతమంది ఆర్టిస్టులను సత్కరించాలనే విషయాన్ని గురించి వంశీ రామరాజు గారితో అక్కినేని నాగేశ్వరరావుగారు ప్రస్తావించారట. ' చెప్పండి సార్ .. ఎవరెవరిని సత్కరిద్దాం' అని వంశీ రామరాజు గారు అడిగారు. కృష్ణ .. విజయనిర్మల .. కోడి రామకృష్ణ .. ఆర్. నారాయణ మూర్తి .. అలీని  పిలవండి అని చెప్పారట. మా ఐదుగురికి ఆయన రవీంద్రభారతిలో 'స్వర్ణ కంకణం' తొడిగి సత్కరించారు. అంతకి మించిన ఆనందం ఏముంటుంది? " అంటూ చెప్పుకొచ్చాడు.        
ali

More Telugu News