Pawan Kalyan: అధికారంలోకి వచ్చాక సోంపేట బీల సమస్యను పరిష్కరిస్తా: పవన్ కల్యాణ్‌ హామీ

షార్ట్స్‌లో చూడండి
జన పోరాట యాత్ర చేపట్టిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సోంపేట, పలాస ప్రాంతాల్లో ప్రజల కష్టాలను తెలుసుకుంటూ హామీలు ఇస్తున్నారు. పర్యటనలో భాగంగా సోంపేట బీల భూముల్ని పరిశీలించిన అనంతరం మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చాక సోంపేట బీల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

రైతులు, యువత సమస్యలపై జనసేన కార్యకర్తలు పోరాడాలని, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ చేసే అభివృద్ధికి జనసేన వ్యతిరేకమని అన్నారు. కాగా, సోంపేటలో మెగా ఫుడ్‌ పార్కు ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తోన్న విషయం తెలిసిందే.               
Go Back to Shorts
Pawan Kalyan
Jana Sena

More Telugu News