Chandrababu: చంద్రబాబుకు ఫోన్ చేసిన దేవెగౌడ!

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జేడీఎస్ అధినేత దేవెగౌడ ఫోన్ చేశారు. కర్ణాటకలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు మద్దతు కోరారు. ఈ సందర్భంగా కర్ణాటకలో చోటు చేసుకున్న పరిణామాలను చంద్రబాబుకు వివరించారు. బీజేపీ అప్రజాస్వామ్య రాజకీయాలపై జాతీయ స్థాయిలోని నేతలు ఏకమవుతున్నారని... మీరు కూడా మద్దతు ఇవ్వాలని బాబును కోరారు.

అయితే, ఈ విషయంపై మాట్లాడాలా? వద్దా? అనే విషయంపై టీడీపీ అధిష్ఠానం తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. మరోవైపు, కర్ణాటక అంశం ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, స్పందించడమే మేలని కొందరు మంత్రులు చెప్పినట్టు తెలుస్తోంది. కర్ణాటక అంశానికి సంబంధించి పలువురు జాతీయ నేతలు చంద్రబాబుకు ఫోన్ చేసి, మాట్లాడినట్టు సమాచారం.
Go Back to Shorts
Chandrababu
deve gowda
phone

More Telugu News