Chandrababu: కాబోయే భర్తతో కలసి చంద్రబాబును కలిసిన భూమా అఖిలప్రియ

షార్ట్స్‌లో చూడండి
ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లిపీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హైదరాబాదులో ఆమె వివాహ నిశ్చితార్థం జరిగింది. భార్గవ్ ను ఆమె పెళ్లాడబోతున్నారు. గత కొంత కాలంగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, తన కాబోయే భర్త భార్గవ్ తో కలసి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె కలిశారు. ఆగస్ట్ 29న తమ వివాహం ఆళ్లగడ్డలో జరగనుందని, రావాలని కోరారు. ఈ సందర్భంగా ఇద్దరినీ ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. వరుడి కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అఖిలప్రియ సోదరుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కూడా వారి వెంట ఉన్నారు.
Go Back to Shorts
Chandrababu
bhooma
akhilapriya
marriage

More Telugu News