ఏం చేయగలనన్న విషయమై అవగాహన వచ్చిన తరువాత ఓ నిర్ణయం తీసుకుంటా!: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అడుగుతున్నారని జోక్
- 'నన్ ఆఫ్ ది ఎబౌ' కూడా ఉందని వ్యాఖ్య
- రెండున్నర నెలల తరువాతే సమాధానం లభిస్తుంది
- ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో లక్ష్మీ నారాయణ
"మీరు ఆబ్జెక్టివ్ టైప్ లాగా అడుగుతున్నారు. నేను ఒక ఎస్ఏ క్వశ్చన్ కు ఆన్సర్ ఇస్తాను. రెండున్నర నెలల తరువాత. ఈ మూడింటితో పాటు 'నన్ ఆఫ్ ది ఎబౌ' కూడా ఉండవచ్చు. వెయిట్ అండ్ వాచ్..." అన్నారు. తన దృష్టి ప్రస్తుతం వ్యవసాయంపై ఉందని, రైతులకు ఏదైనా మేలు కలిగించే చర్యలు తీసుకోవాలని ఉందని చెప్పారు. ముందు తన సామర్థ్యాన్ని లెక్కించుకుంటున్నానని, తాను ఏం చేయగలనన్న విషయమై అవగాహన వచ్చిన తరువాత ఓ నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఇంకో మూడు సంవత్సరాల ముందే ఉద్యోగాన్ని ఎందుకు వీడలేదా? అని ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయని, అప్పుడే ఉద్యోగాన్ని వీడివుంటే, ఈపాటికి తన లక్ష్యానికి మరింత దగ్గరై ఉండేవాడినని అన్నారు.