మల్టీస్టారర్ నుంచి శర్వానంద్ తప్పుకునే ఛాన్స్!
- మల్టీ స్టారర్ గా 'దాగుడుమూతలు'
- దర్శకుడిగా హరీశ్ శంకర్
- ఒక హీరోగా నితిన్
హరీశ్ శంకర్ 'దాగుడుమూతలు' అనే మల్టీ స్టారర్ ను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఒక హీరోగా నితిన్ ను .. మరో హీరోగా శర్వానంద్ ను తీసుకున్నాడు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి శర్వానంద్ తప్పుకునే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే టాక్ వినిపిస్తోంది. కారణాలేమిటనేది తెలియదుగానీ, హరీశ్ శంకర్ సినిమా నుంచి శర్వానంద్ తప్పుకోనున్నాడని అంటున్నారు. అదే నిజమైతే మరో హీరోగా ఎవరిని తీసుకుంటారో చూడాలి. త్వరలోనే ఈ సినిమా కోసం కథానాయికలను కూడా ఎంపిక చేయనున్నారు.