India: భారత్‌పై దాడి చేయించడానికి ఐఎస్‌ఐ భారీ కుట్ర: భారత నిఘా వర్గాల వెల్లడి

షార్ట్స్‌లో చూడండి
కశ్మీర్‌ లోయలో దాడులు చేయించేందుకు పాక్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) సిద్ధమవుతోందని భారత నిఘా వర్గాలు తెలిపాయి. ఇందుకోసం తమ జైళ్లలో ఉన్న తెహ్రిక్‌ ఐ తాలిబన్‌ ఉగ్రవాదులను ఐఎస్‌ఐ విడుదల చేయించి, వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తోందని పేర్కొన్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నయాలీ అటవీ ప్రాంతంలో వీరికి శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశాయి.

ఆ ప్రాంతంలో సుమారు 135 మంది ఉగ్రవాదులకు జైషే ఈ మహమ్మద్‌ ఉగ్రసంస్థ నయాలీలోని శిక్షణ కేంద్రంలో ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇస్తోందని, ఉగ్రవాదులు అమర్‌నాథ్‌ యాత్రపై కూడా దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. దీనిపై హోం మంత్రిత్వ శాఖ అప్రమత్తమై సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసింది.
Go Back to Shorts
India
Pakistan
ib

More Telugu News