నేను నటించిన సినిమాలు కూడా నేను చూడను: నటుడు జీవా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను నటించిన సినిమాలు కూడా నేను చూడను: నటుడు జీవా

  • నేను సినిమాలు చూడను 
  • థియేటర్స్ కి వెళ్లి చూసింది చాలా తక్కువ 
  • ఒకసారి బాలచందర్ గారు కూడా తిట్టారు   
విలనిజానికి కామెడీ టచ్ ఇస్తూ ప్రేక్షకులను మెప్పించడం జీవా ప్రత్యేకత. ఆ తరహా పాత్రలను ఆయన అద్భుతంగా రక్తి కట్టిస్తారు. అలాంటి జీవా తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. "నేను సినిమాలు చూడను .. ఈ విషయం తెలిసి బాలచందర్ గారు కూడా నన్ను తిట్టారు. సినిమా మీద బతుకుతూ సినిమాలు చూడనంటావేంట్రా అని చాలామంది అంటారు" అని తెలిపారు.

"ఏం చేయమంటారు .. మరి నాకు మొదటి నుంచి అలవాటు లేదాయే. ఎప్పుడైనా ఇంట్లో పాత సినిమాలు చూస్తుంటాను అంతే. నిజం చెప్పాలంటే నేను సినిమాలు కాదు .. థియేటర్స్ వైపు కూడా చూడను. నేను నటించిన సినిమాలు కూడా థియేటర్స్ లో చూడలేదు. ఒకసారి మాత్రం 'గులాబీ' సినిమాకి మా ఆవిడను వెంటబెట్టుకెళ్లాను. అందులో నా విలనిజం సీన్ రాగానే నా వైపు భయంతో చూస్తూ మా ఆవిడ దూరంగా జరిగింది" అంటూ నవ్వేశారాయన.   
jeeva
tollywood

More Telugu News