వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు
- క్రికెట్ బుకీలతో కోటంరెడ్డికి సంబంధాలు
- రిపోర్టు తయారు చేసిన నెల్లూరు ఎస్పీ రామకృష్ణ
- ఏసీబీ విచారణకు ఆదేశించిన డీజీపీ మాలకొండయ్య
విజయవాడలోని పలు హోటళ్లలో ప్రధాన బుకీ కృష్ణసింగ్ అనుచరులతో కోటంరెడ్డి పలుమార్లు సమావేశమైనట్టు గుర్తించిన పోలీసులు, అందుకు హోటల్ బిల్లులు, సీసీటీవీ ఫుటేజీలను సాక్ష్యంగా సేకరించి, రిపోర్టుకు జత చేశారు. కృష్ణసింగ్ పేరు బయటకు వచ్చిన తరువాత, ఆయన కొన్నాళ్లు పరారీలో ఉండగా, ఆ సమయంలో దాక్కోవడానికి చోటు కల్పించింది కోటంరెడ్డేనని, ఆపై కృష్ణసింగ్ కోర్టులో తనంతట తానుగా లొంగిపోయేందుకు కూడా కోటంరెడ్డి సహకరించారని, ఇందుకుగాను విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా రూ. 23 లక్షలను కోటంరెడ్డికి కృష్ణసింగ్ అందించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.