ram gopal varma: 'బాహుబలి'లో శ్రీదేవి నటించకపోవడానికి కారణం ఏమిటో చెప్పిన రామ్ గోపాల్ వర్మ

షార్ట్స్‌లో చూడండి
తెలుగు సినీ పరిశ్రమ సత్తాను ప్రపంచ నలుమూలలా చాటిన 'బాహుబలి' సినిమాలో శివగామి పాత్ర కోసం తొలుత దివంగత శ్రీదేవిని సంప్రదించారు దర్శకుడు రాజమౌళి. అయితే, ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో పాటు పలు కండిషన్లను పెట్టడంతో... దర్శకనిర్మాతలు వెనక్కి తగ్గారు.

ఈ నేపథ్యంలో 'బాహుబలి' సినిమాలో శ్రీదేవి ఎందుకు నటించలేదో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో విమర్శించారు. దీనికంతా కారణం శ్రీదేవి భర్త బోనీ కపూరే అని తెలిపారు. తాను ఆ సమయంలో శ్రీదేవితో స్వయంగా మాట్లాడానని... గొప్ప సినిమా అని, అవకాశం వదులుకోవద్దని చెప్పానని అన్నారు.

సినిమాలో చేయడానికి శ్రీదేవి ఆసక్తి కూడా చూపింది. కానీ, బోనీకి మాత్రం ఇష్టం లేదని... దీంతో, రెమ్యునరేషన్ ను భారీగా డిమాండ్ చేసి, 'బాహుబలి'లో శ్రీదేవి నటించకుండా చేశారని తెలిపారు. బోనీ కపూర్ నిర్ణయాల వల్ల కెరీర్ పరంగా శ్రీదేవి చాలా నష్టపోయారని చెప్పారు. తండ్రిని కోల్పోయిన తర్వాత శ్రీదేవి ఏ ఒక్కరోజు కూడా సంతోషంగా లేరని అన్నారు.
Go Back to Shorts
ram gopal varma
rgv
babubali
sridevi

More Telugu News