పవన్ కు రాజకీయ పరిణతి లేదు!: గంటా శ్రీనివాసరావు విమర్శలు
- జగన్, పవన్ లు మోదీని ఒక్క మాట కూడా అనడం లేదు
- టీడీపీని బలహీనపరచేందుకు వీరు కుట్ర పన్నారు
- చంద్రబాబు కల నెరవేరాలని వెంకన్నకు మొక్కుకున్నా
ఈ ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని గంటా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 30న నిర్వహించనున్న తిరుపతి బహిరంగసభ విజయవంతం కావాలని స్వామి వారిని కోరుకున్నానని చెప్పారు. ఏపీని నెంబర్ వన్ చేయాలనే చంద్రబాబు కల నెరవేరాలని వేడుకున్నానని తెలిపారు.