ప్రియనేతకు తుది వీడ్కోలు పలికేందుకు పోటెత్తుతున్న అభిమానులు.. కాసేపట్లో నెల్లూరుకు చంద్రబాబు
- వివేకా మరణంతో కన్నీటిసంద్రమైన నెల్లూరు
- నివాళి అర్పించేందుకు నెల్లూరు వస్తున్న ముఖ్యమంత్రి
- పెన్నా తీరంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
మరోవైపు, కాసేపట్లో నెల్లూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా వివేకాకు ఆయన నివాళి అర్పించి, కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేయనున్నారు. ఈ సాయంత్రం వివేకా అంతిమ యాత్ర మొదలవుతుందని ఆయన సోదరుడు, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. అధికారిక లాంఛనాలతో పెన్నా తీరంలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన చెప్పారు. వివేకా లేకపోతే రాజకీయమే లేదని అన్నారు.