nayanatara: మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పిన నయనతార .. ఆమె చుట్టూనే కథ!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో నయనతారకి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. ఒక వైపున సీనియర్ హీరోలతోను .. మరో వైపున యువ కథానాయకులతోను ఆమె వరుస సినిమాలు చేస్తూ వెళుతోంది. ఇక కథానాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలను కూడా తనదైన స్టైల్లో చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. తెలుగులో చిరూతోను .. తమిళంలో అజిత్ తోను చేస్తోన్న ఆమె, కొత్త ప్రాజెక్టులకు చకచకా సైన్ చేసేస్తోంది.

రీసెంట్ గా ఆమె 'కో కో' అనే డార్క్ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా 'కొట్టయం కుర్బాన' అనే మలయాళ సినిమాను చేయడానికి ఆమె ఓకే చెప్పేసిందని సమాచారం. మహేశ్ వెట్టియార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఒక స్టార్ హీరో ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.   
Go Back to Shorts
nayanatara

More Telugu News