'రంగస్థలం' ఫంక్షన్లో నేను మాట్లాడకపోవడానికి కారణం ఇదే: అనసూయ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రంగస్థలం' ఫంక్షన్లో నేను మాట్లాడకపోవడానికి కారణం ఇదే: అనసూయ

  • నిన్న 'రంగస్థలం' విజయోత్సవ వేడుకలు
  • ఫంక్షన్లో మాట్లాడని అనసూయ
  • తన గొంతు బాగోలేదని తెలిపిన రంగమ్మత్త
నిన్న రాత్రి 'రంగస్థలం' విజయోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సినిమాకు సంబంధించిన వారంతా ఈ సందర్భంగా మాట్లాడినప్పటికీ... చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించిన 'రంగమ్మత్త' అనసూయ మాత్రం మాట్లాడలేదు.

దీంతో, చాలా మంది ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. దీనిపై అనసూయ క్లారిటీ ఇచ్చింది. తాను మాట్లాడతానని ఎదురు చూసిన వారందరికీ 'సారీ' అంటూ ట్వీట్ చేసింది. తన గొంతు సరిగా లేదని, ఆరోగ్యం కూడా బాగోలేదని అందుకే మాట్లాడలేక పోయానని తెలిపింది. అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పింది.
anasuya
rangasthalam
speech

More Telugu News