‘రంగస్థలం’ సక్సెస్ మీట్ .. ‘జిగేల్ రాణి’ పాటకు స్టెప్పులేసిన రామ్ చరణ్!
Add ap7am to your home Screen

‘రంగస్థలం’ సక్సెస్ మీట్ .. ‘జిగేల్ రాణి’ పాటకు స్టెప్పులేసిన రామ్ చరణ్!

  • హైదరాబాద్ లో ‘రంగస్థలం’ విజయోత్సవ సభ
  • వేదికపై ఆడిపాడిన చిత్ర యూనిట్
  • హుషారుగా సాగుతున్న కార్యక్రమం
‘రంగస్థలం’ విజయోత్సవ సభ హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో జరుగుతున్నాయి. ఈ వేడుకకు దర్శకుడు సుకుమార్,  హీరో రామ్ చరణ్, హీరోయిన్ సమంత, నటులు నరేష్, జగపతిబాబు, అజయ్ ఘోష్, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, పాటల రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వేదికపై చిత్ర యూనిట్ సరదాగా ఆడిపాడింది. రంగస్థలం చిత్రంలోని ‘ఓ ముద్దు పెట్టవే జిగేల్ రాణీ.. కన్నయినా కొట్టవే జిగేల్ రాణి..’ పాటకు చిత్ర యూనిట్ ఆడిపాడింది. వేదికపై వీళ్లు స్టెప్పులేస్తున్న సమయంలోనే రామ్ చరణ్ వచ్చారు. దీంతో వేదికపైకి వచ్చి ఆ పాటకు ఓ స్టెప్పు వేయాల్సిందిగా రామ్ చరణ్ ను సుకుమార్ కోరారు. వెంటనే, ఆయన వేదికపైకి వెళ్లి ‘ఓ ముద్దు పెట్టవే జిగేల్ రాణీ..’కి రామ్ చరణ్ స్టెప్పులేయడంతో చప్పట్లు మార్మోగిపోయాయి.  
rangasthalam
ram charan

More Telugu News