ఎన్నికల సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ సింగ్
- రెండు సార్లు సీఎంగా చేశా
- మరోసారి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక లేదు
- రాహుల్ ఏ బాధ్యతలు అప్పగించినా.. స్వీకరిస్తా
రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన ఏకైక లక్ష్యమని తెలిపారు. పార్టీ వర్గాలను ఏకతాటిపై నడిపించి, బీజేపీని ఓడించడమే తన అభిమతమని చెప్పారు. తమ అధినేత రాహుల్ గాంధీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని తెలిపారు. మరోవైపు నర్మదా నది పరిరక్షణ కోసం ఆరు నెలల పాటు ఆయన చేపట్టిన 3,100 కిలోమీటర్ల పాదయాత్ర ఇటీవలే ముగిసింది. ఓంకారేశ్వర్ ఆలయంలో ఆయన యాత్రను ముగించారు. ఈ సందర్భంగా నర్మదా ఘాట్లలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయంలో అభిషేకాలు చేశారు.