అన్నంత పనీ చేసిన మిలింద్ గుజ్రార్.. హార్దిక్ పటేల్‌పై ఇంకు చల్లిన ‘గుజ్రార్’ కార్యదర్శి

పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌కు మధ్యప్రదేశ్‌లో చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్‌లో మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన హార్దిక్ ఉజ్జయినిలో రోడ్డు పక్కన ఉన్న ఓ హోటల్‌లో భోజనం చేస్తుండగా ఓ వ్యక్తి అతడిపై ఇంకు చల్లాడు. గుజ్రార్ మహాసభ కార్యకర్తగా చెబుతున్న మిలింద్ గుజ్రార్ ఒక్కసారిగా లేచి పటేల్‌పై ఇంకు కుమ్మరించాడు. దీంతో పటేల్ చొక్కా మొత్తం ఇంకుతో తడిసిపోయింది.

వెంటనే అప్రమత్తమైన పటేల్ మద్దతుదారులు గుజ్రార్‌ను పట్టుకుని దాడిచేశారు. ఇష్టం వచ్చినట్టు కొట్టారు.  పోలీసులు జోక్యం చేసుకుని వారి నుంచి అతడిని రక్షించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. గుజ్రార్ మహాసభ కార్యదర్శి అయిన మిలింద్ గతంలోనే పటేల్‌ను హెచ్చరించాడు. పటేల్ ఉజ్జయినిలో అడుగుపెడితే అతడి ముఖాన్ని నల్లగా మార్చేస్తానని హెచ్చరికలు జారీ చేశాడు. శనివారం అన్నంత పనీ చేశాడు.
Go Back to Shorts
Hardik patel
Madhya Pradesh
Ujjain
Ink

More Telugu News