సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్యనంటూ మహిళ హల్ చల్.. చంద్రబాబు నివాసం వద్ద ఘటన

  • చంద్రబాబు ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళ
  • పోలీసులకు పొంతన లేని సమధానాలిచ్చిన రీటా
  • పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
అమరావతిలోని ఉండవల్లిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఓ మహిళ అలజడి రేపింది. ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆమెను పోలీసులు ప్రశ్నించగా... సచివాలయానికి వెళుతున్నానని చెప్పింది. అయితే, ఆమె అక్కడ నుంచి వెళ్లకుండా, అక్కడే అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు మరోసారి ఆమెను ప్రశ్నించారు.

ఈ సందర్భంగా సీబీఐ అధికారిని అంటూ ఒకసారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్యనంటూ మరోసారి పొంతన లేకుండా సమాధానాలు ఇచ్చింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర స్వాధీనం చేకున్న ఓ పత్రంలో ఆమె పేరు ఎర్విన్ రీటాగా ఉంది. భర్త స్థానంలో వీవీ లక్ష్మీనారాయణ అని ఉంది. అనంతరం ఆమెను తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. 
Go Back to Shorts
jd lakshminayarayana
wife
Chandrababu
residence

More Telugu News