Chandrababu: ఢిల్లీలో దేశ రాజకీయాలపై మాట్లాడేందుకు విముఖత చూపిన చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్‌లో జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జాతీయ రాజ‌కీయాలపై మాట్లాడేందుకు విముఖ‌త చూపారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అన్యాయంపైనే తాను మాట్లాడతానని తెలుపుతూ... రాష్ట్రానికి ఇవ్వాల్సిన 19 పెండింగ్ అంశాల జాబితాను వివరించారు. తాము ఎన్డీఏ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందన్న విషయాన్ని చెప్పారు.

పోలవరం నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చి వెనక్కి తీసుకున్నారని చంద్రబాబు చెప్పారు. బీజేపీతో టీడీపీకి ఇక ఎలాంటి సంబంధాలు ఉండవని స్పష్టం చేశారు. అవినీతి పార్టీ వైసీపీని బీజేపీ చేరదీస్తోందని, ప్రధాని కార్యాలయాన్ని వైసీపీ ఇష్టం వచ్చినట్లు వాడుకుంటోందని అన్నారు.
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
BJP
New Delhi

More Telugu News