వైసీపీ రాజకీయాలు పెద్ద డ్రామా.. మోదీ అంటే జగన్ కు భయం: మంత్రి సోమిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
ఏపీకి మోదీ చేసిన మోసాన్ని దేశమంతా గుర్తించిందని, బీజేపీ మిత్ర ద్రోహానికి పాల్పడిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ‘ఏబీఎన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ, వైసీపీ లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని, వైసీపీ రాజకీయాలు పెద్ద డ్రామా అని, మోదీ అంటే జగన్ కు భయమని విమర్శించారు. ఈడీ, సీబీఐ కేసుల నుంచి జగన్ తప్పించుకోలేరని, మోదీపై వైసీపీ విశ్వాసం ప్రకటించి, అవిశ్వాసం తీర్మానం ఇచ్చిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

విజయసాయిరెడ్డి సలహాలతోనే ప్రజాధనాన్ని జగన్ దోచుకున్నారని, సీఎం తల్లిదండ్రుల గురించి ఆయన నీచంగా మాట్లాడారంటూ దుయ్యబట్టారు. విజయ్ మాల్యా కంటే విజయసాయిరెడ్డి, జగన్ పెద్ద ఆర్థిక నేరస్థులని, ప్రజల డబ్బులు దోచుకుని విలాసవంతమైన భవంతులు నిర్మించుకున్నారని ఆరోపించారు. పైరవీలు చేయడంలో విజయసాయిరెడ్డి సిద్ధహస్తుడని, బీజేపీతో వైసీపీ కుమ్మక్కవడం వల్లే జగన్ కేసులో అటాచ్ అయిన సొమ్ము వెనక్కి వచ్చిందని అనుమానం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా విపక్షనేతలపై మోదీ కక్ష సాధిస్తున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు.
Go Back to Shorts
Jagan
somi reddy

More Telugu News