ఇప్పుడు పాలిటిక్స్ మనకెందుకండీ! : ప్రముఖ హాస్యనటుడు అలీ
Add ap7am to your home Screen

ఇప్పుడు పాలిటిక్స్ మనకెందుకండీ! : ప్రముఖ హాస్యనటుడు అలీ

  • హైదరాబాద్ లో ఓ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అలీ
  • బయటి ఆహారం నేను ఎక్కువగా తీసుకోను
  • స్ట్రమక్ అప్ సెట్ అయితే..షూటింగ్ అప్ సెట్ అయిపోతోంది : అలీ
హైదరాబాద్ లో ఓ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను పలకరించిన మీడియాతో అలీ మాట్లాడుతూ, ‘వెజ్, నాన్ వెజ్, పప్పూ సాంబారు అన్నీ తింటాను, నేను చెన్నైలో పదిహేనేళ్ల పాటు ఉన్నప్పుడు మెస్ లో తింటుండే వాడిని. కేవలం, ఆదివారాలు మాత్రమే నాన్ వెజ్ తినేవాడిని. మిగిలిన ఆరు రోజులు వెజిటేరియన్ ఫుడ్ తీసుకునేవాడిని. సాధారణంగా, బయటి ఆహారం నేను ఎక్కువగా తీసుకోను. ఎందుకంటే, స్ట్రమక్ అప్ సెట్ అయిందంటే..షూటింగ్ అప్ సెట్ అయిపోతోంది. అందుకని, ఎక్కువ శాతం ఇంటి నుంచి వచ్చిన ఆహారాన్నే తీసుకుంటూ ఉంటాను. నేను బాగానే తింటాను’ అని చెప్పుకొచ్చారు. ‘రజనీకాంత్ రాజకీయాల్లోకి రానున్నారు. కమలహాసన్, పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చేశారు కదా, భవిష్యత్ లో వారితో కలిసి మీరు పని చేస్తారా?’ అనే ప్రశ్నకు అలీ స్పందిస్తూ, ‘ఇప్పుడు, పాలిటిక్స్ మనకెందుకండి! ఇంకా టైముంది. అప్పుడు చెబుతాను’ అంటూ అలీ నవ్వులు చిందించారు.
Tollywood
comedian ali

More Telugu News