nagam: అమిత్‌ షాకి మెయిల్‌ ద్వారా రాజీనామా లేఖ పంపిన నాగం జనార్దన్‌ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఈ రోజు బీజేపీకి రాజీనామా చేశారు. మెయిల్‌ ద్వారా ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాకు రాజీనామా లేఖ పంపారు. గత కొంత కాలంగా నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి రాహుల్ గాంధీని కలిశారని కూడా వార్తలు వచ్చాయి. బీజేపీకి రాజీనామా చేసిన సందర్భంగా నాగం మీడియాతో మాట్లాడుతూ... టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతిపై తాను పోరాడుతోంటే తనకు బీజేపీ ఏమాత్రం సహకరించడం లేదని ఆరోపించారు. తాను ఏ పార్టీలో చేరతానన్న విషయం త్వరలోనే చెబుతానని తెలిపారు. 
Go Back to Shorts
nagam
BJP
Congress

More Telugu News