తెలుగులో ఏ హీరోతో నటించాలని ఉందంటే .. రాశి ఖన్నా సమాధానం!
Add ap7am to your home Screen

తెలుగులో ఏ హీరోతో నటించాలని ఉందంటే .. రాశి ఖన్నా సమాధానం!

  • ఒక్కో మెట్టూ ఎక్కుతోన్న రాశి ఖన్నా 
  • హిందీలో రణ్ బీర్ కపూర్ తో నటించాలని వుంది 
  • తెలుగులో అందరి హీరోలతో చేయాలని వుంది   
'ఊహలు గుసగుసలాడే' .. 'బెంగాల్ టైగర్' .. 'సుప్రీమ్' .. ' జై లవకుశ' .. 'తొలిప్రేమ' సినిమాలు రాశిఖన్నా కెరియర్ కి ఎంతో హెల్ప్ చేశాయి. సినిమా .. సినిమాకి ఆమె తన గ్లామర్ తో పాటు నటనకి కూడా మెరుగులు దిద్దుతూ, వరుసగా అవకాశాలను దక్కించుకుంటోంది. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ .. ఆలీ సరదా ప్రశ్నలకి తనదైన శైలిలో సమాధానమిచ్చింది.

హిందీలోను .. తెలుగులోను ఏ హీరోలతో నటించాలని ఉందనే ప్రశ్నకి ఆమె స్పందిస్తూ .. "హిందీలో రణ్ బీర్ కపూర్ తో కలిసి నటించాలని వుంది. ఇక తెలుగు విషయానికొస్తే, పవన్ .. మహేశ్ బాబు .. చరణ్ .. బన్నీ .. ఇలా అందరి హీరోలతో కలిసి నటించాలని వుంది" అంటూ చెప్పింది. దాంతో 'తెలివి తేటలు బాగానే నేర్చావ్' అన్నట్టుగా ఆలీ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ నవ్వుల పువ్వులు పూయించింది.   
ali
rasi khanna

More Telugu News