నాకు ఆ కుర్రాడు లవ్ లెటర్ రాశాడు: రాశి ఖన్నా
Add ap7am to your home Screen

నాకు ఆ కుర్రాడు లవ్ లెటర్ రాశాడు: రాశి ఖన్నా

  • నా సీనియర్ నాకు లవ్ లెటర్ ఇచ్చాడు 
  • ఆ తరువాత చాలామంది ఇవ్వడానికి ట్రై చేశారు 
  • నేను తీసుకోలేదు  
తెలుగు తెరపై అందాల కథానాయికగా మార్కులు కొట్టేసిన వారిలో రాశి ఖన్నా ముందువరుసలో కనిపిస్తుంది. అందం .. అమాయకత్వం కలగలిసిన కథానాయికగా యూత్ మనసులను ఆమె దోచేసుకుంది. నిదానంగా ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ ముందుకు వెళుతోన్న రాశి ఖన్నా, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో తనకి సంబంధించిన అనేక విషయాలను ముచ్చటించింది.

 " ప్రేమకి సంబంధించిన ఫస్టు ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది?" అనే ప్రశ్న ఆమెకి ఆలీ నుంచి ఎదురైంది. అందుకామె స్పందిస్తూ .. " నా 17 యేళ్ల వయసులో ఫస్టు లవ్ ఇన్సిడెంట్ జరిగింది. ఢిల్లీలో స్కూల్లో నా సీనియర్ నాకు లవ్ లెటర్ రాశాడు. ఒక రోజ్ తో పాటు ఆ లవ్ లెటర్ ను తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ తరువాత కూడా చాలామంది లవ్ లెటర్స్ ఇవ్వడానికి ప్రయత్నించారు గానీ .. తీసుకోలేదు" అంటూ చెప్పుకొచ్చింది.  
ali
rasi khana

More Telugu News