'యమలీల'లో ఛాన్స్ రావడం ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే: ఇంద్రజ
Add ap7am to your home Screen

'యమలీల'లో ఛాన్స్ రావడం ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే: ఇంద్రజ

  • నేను 'జంతర్ మంతర్' షూటింగులో వున్నాను 
  • అక్కడికి ఎస్వీ కృష్ణారెడ్డి గారు వచ్చారు 
  • నా కోసమే వచ్చారని తెలిసి షాక్ అయ్యాను     
తెలుగు తెరపై అందం .. అభినయం కలగలిసిన కథానాయికల జాబితాలో ఇంద్రజ పేరు కూడా కనిపిస్తుంది. ఇంద్రజ పేరు వినగానే 'యమలీల' .. ' సొగసు చూడతరమా' .. 'ఒక చిన్నమాట' వంటి సినిమాలు గుర్తుకువస్తాయి. అలాంటి ఇంద్రజ .. తాజాగా 'ఆలీతో సరదాగా' వేదికపై అనేక విషయాలను ముచ్చటించారు.

'యమలీల'లో హీరోయిన్ గా ఎలా ఛాన్స్ వచ్చింది ?' అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ .." శ్రీకాంత్ సరసన నేను 'జంతర్ మంతర్' సినిమా చేస్తున్నాను. ఒక రోజున అక్కడికి ఎస్వీ కృష్ణారెడ్డి గారు వచ్చారు. ఆయన నా కోసమే వచ్చారని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆయన నాతో మాట్లాడారు .. అప్పటికి తెలుగు సరిగ్గా రాకపోయినా 'ఊఁ' కొట్టాను. ఫైనల్ గా ఆయన .. 'ఈ మూవీలో నువ్ చేస్తున్నావమ్మా' అన్నారు .. నేను ఆశ్చర్యపోతూనే 'ఆఁ' అన్నాను. అలా నేను 'యమలీల' సినిమాకి సెలెక్ట్ కావడం ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.       
indraja
ali

More Telugu News