Chandrababu: అందుకే, కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ నేతలు బయటకు వచ్చేశారు: కేటీఆర్

షార్ట్స్‌లో చూడండి
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... భారత్ రెండు పార్టీల వ్యవస్థ కాదని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. అధికారం అంతా ఢిల్లీలో కేంద్రీకృతమై ఉందని, అది సరికాదని తెలిపారు. అందుకే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఆలోచనను తీసుకొచ్చారని, అది మంచి పరిణామాలకే దారి తీస్తుందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా అదనంగా నిధులు రాలేదని, రావాల్సిన నిధులే వచ్చాయని కేటీఆర్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కి కూడా ఇదే జరిగిందని తాను అనుకుంటున్నానని, అందుకే కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ నేతలు బయటకు వచ్చేశారని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. మిత్రపక్షాలను ఎందుకు కోల్పోతున్నామన్న విషయాన్ని బీజేపీ ఆలోచించుకోవాలని అన్నారు. 
Go Back to Shorts
Chandrababu
KTR
Telangana
Andhra Pradesh

More Telugu News