అఖిల్ కి అనుకున్న టైటిల్ రామ్ కి కుదిరింది!
Add ap7am to your home Screen

అఖిల్ కి అనుకున్న టైటిల్ రామ్ కి కుదిరింది!

  • రామ్ హీరోగా 'హలో గురు ప్రేమ కోసమే'
  • దర్శకుడిగా త్రినాథ్ రావ్ నక్కిన 
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ 
  • కీలక పాత్రలో ప్రకాశ్ రాజ్    
యూత్ కి ప్రాధాన్యతనిస్తూనే .. మాస్ ఆడియన్స్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని రామ్ కథలను ఎంచుకుంటూ ఉంటాడు. ఆయన సినిమాల్లో కథ జోరుగా హుషారుగా పరుగులు తీస్తూ ఉంటుంది. అది యాక్షన్ .. ఎమోషన్ తో పాటు కామెడీని కలుపుకుని ఉంటుంది. అలాంటి రామ్ తన తదుపరి సినిమాను .. త్రినాథ్ రావ్ నక్కినతో సెట్ చేసుకున్నాడు.

ఈ సినిమాకి 'హలో గురు ప్రేమ కోసమే' అనే టైటీల్ ను నిర్ణయించి .. కొంతసేపటి క్రితమే ఈ సినిమాను లాంచ్ చేశారు. గతంలో అఖిల్ కోసం ఈ టైటిల్ ను పరిశీలించారు గానీ ఖరారు చేయలేదు. ఇప్పుడు అదే టైటిల్ రామ్ కథకి కుదరడం విశేషం. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుండగా, కీలకమైన పాత్రను ప్రకాశ్ రాజ్ పోషించనున్నాడు. 'సినిమా చూపిస్త మావ' .. 'నేను లోకల్' వంటి హిట్స్ దర్శకుడి ఖాతాలో ఉండటం వలన, ఈ ప్రాజెక్టుపై అందరిలోనూ ఆసక్తి వుంది.       
ram
anupama

More Telugu News