Bihar: ఆ అభాగ్యురాలు పింకీ ఫొటో ఇదే... విడుదల చేసిన హైదరాబాద్ పోలీసులు!

షార్ట్స్‌లో చూడండి
దాదాపు నెల రోజుల క్రితం గోనె సంచిలో ముక్కలు ముక్కలుగా కనిపించిన గర్భిణి పింకీ రూపాన్ని ఎట్టకేలకు సంపాదించిన హైదరాబాద్ పోలీసులు, ఆమె ఫొటోను విడుదల చేశారు. జనవరి 30న గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్స్ సమీపంలో పింకీ మృతదేహం దొరకగా, రెండు వారాల పాటు విచారణ జరిపిన పోలీసులు ఆమె హత్యకు కారణమైన ప్రియుడు వికాస్ కశ్యప్ సహా నలుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఆపై పింకీ చిత్రం కోసం బీహార్ కు వెళ్లి ఆమె తల్లిదండ్రులను సంప్రదించినా, వికాస్ స్వస్థలానికి వెళ్లి విచారించినా పోలీసులు విఫలమయ్యారు. ఆపై మరోసారి వికాస్ ను విచారించగా, పింకీ చిత్రం, ఆమె ఆధార్ కార్డు వివరాలు పోలీసులకు చిక్కాయి. హత్య తరువాత ఆధారాలు దొరక కూడదన్న ఉద్దేశంతో ఆమె ఫోటోలను వికాస్ చింపివేసి డంపింగ్ యార్డుల్లో పడేశాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. చివరిగా మిగిలిన ఫోటో ఇదేనంటూ మీడియాకు పింకీ చిత్రాన్ని చూపించారు.
Go Back to Shorts
Bihar
Uttar Pradesh
Pinky
Murder
Hyderabad
Police
Photo

More Telugu News