ముంబై లోకల్ ట్రైన్ లో క్రికెటర్... గూగుల్ ని ఆశ్రయించి నిర్ధారించుకున్న ప్రయాణికులు
- అంధేరీలో లోకల్ ట్రైన్ ఎక్కిన శార్ధుల్ ఠాకూర్
- టీమిండియా క్రికెటరేనా? అని గూగుల్ లో చూసుకున్న ప్రయాణికులు
- సెల్ఫీలు, ఫొటోలతో సందడి
కొందరు యువకులు మాత్రం గూగుల్ ని ఆశ్రయించి, ట్రైన్ లో తమతో ప్రయాణిస్తున్నది శార్ధుల్ ఠాకూరేనని రూఢీ చేసుకుని, అతనితో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. అందరితోనూ నవ్వుతూ మాట్లాడి, తన స్టేషన్ రాగానే అందరికీ బై చెప్పి వెళ్లిపోయాడు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్ లో శార్థుల్ ను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.