కుర్చీలో కూర్చునే క్రికెట్ ఆడిన కరుణానిధి... తెగ వైరల్ అవుతున్న వీడియో!

  • మునిమనవడితో క్రికెట్ ఆడిన కరుణానిధి
  • చక్రాల కుర్చీలో కూర్చునే బౌలింగ్
  • ఫీల్డింగ్ చేసిన బంధువులు
తమిళనాట డీఎంకే అధినేత, భారత రాజకీయాల్లో కురువృద్ధుడి వంటి కరుణానిధి ఏం చేసినా సంచలనమే. తాజాగా ఆయన తన మనవడితో క్రికెట్ ఆడిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. క్రికెట్ ఆడేందుకు ఆయన ఏ మైదానానికో వెళ్లలేదు సుమండీ. తన ఇంట్లోనే, తన చక్రాల కుర్చీలో కూర్చునే ఆయన ఆడారు. తన మునిమనవడు బ్యాటు పట్టుకుని ఆడుతుంటే, సరదాగా బౌలింగ్ చేశారు. ఇంట్లోని ఆయన బంధువుల్లోని ఇద్దరు మహిళలు ఫీల్డింగ్ చేస్తూ, బాల్ ను కరుణానిధికి అందించారు. కరుణానిధి ఆరోగ్యం క్షీణించిందని వస్తున్న వదంతులకు ఈ వీడియో చెక్ చెప్పగా, డీఎంకే అభిమానులు తమ నేత బాగానే ఉన్నారంటూ ఊరట చెందుతున్నారు. కరుణానిధి క్రికెట్ ఆడుతున్న వీడియోను మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
Karunanidhi
DMK
Tamilnadu
Cricket

More Telugu News