మంచి పాత్రలిప్పిస్తానని లొంగదీసుకుని, పరారైన కో డైరెక్టర్ అరెస్టు!
Add ap7am to your home Screen

మంచి పాత్రలిప్పిస్తానని లొంగదీసుకుని, పరారైన కో డైరెక్టర్ అరెస్టు!

  • సినిమాల్లో రాణించాలని ఎన్నో కలలతో హైదరాబాదు చేరిన యువతి
  • మంచి అవకాశాలిప్పిస్తానని లొందీసుకున్న రాజశేఖర్
  • పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో డిసెంబర్ లో పరారీ
సీరియళ్లలో మంచి పాత్రలిప్పిస్తానని నమ్మించి ఓ యువతిని లొంగదీసుకుని పరారైన సినీ కో డైరెక్టర్‌ ను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన ఘటన వివరాల్లతోకి వెళ్తే... సినిమాల్లో నటించి, మంచి పేరు, సెలబ్రిటీ హోదా, డబ్బు సంపాదించాలని ఎన్నో కలలతో హైదరాబాదు చేరిన శ్రీకాకుళం యువతికి స్టేషన్‌ ఘన్‌ పూర్‌ ప్రాంతానికి చెందిన సినీ కో డైరెక్టర్‌ పి.రాజశేఖర్‌ పరిచయమయ్యాడు.

 సీరియళ్లలో మంచి పాత్రలిప్పిస్తానని నమ్మించాడు. ఆ పరిచయాన్ని అడ్డంపెట్టుకుని, ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని కల్లబొల్లి కబుర్లు చెప్పి ఆమెను లోబరచుకున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం తనను వివాహం చేసుకోవాలని బాధిత యువతి అతనిపై ఒత్తిడి తేవడంతో రాజశేఖర్ గత డిసెంబర్ లో పరారయ్యాడు. అతని జాడతెలియని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. 
Hyderabad
film industry
Cheating
acting chance

More Telugu News