అందుకే, నిన్నటి మ్యాచ్‌లో ఓడిపోయి.. సిరీస్ కోల్పోయాం: దక్షిణాఫ్రికా కెప్టెన్
- టీమిండియా బౌలర్లు నియంత్రణతో బౌలింగ్ చేశారు
- లక్ష్యాన్ని ఛేదించలేకపోయాం
- ముఖ్యంగా పవర్ ప్లేలో టీమిండియా బౌలర్లు విసిరిన బంతులు దెబ్బతీశాయి
- తొలి ఆరు ఓవర్లలో సింగిల్స్ తీయడం అత్యంత కష్టమైంది
తొలి ఆరు ఓవర్లలో సింగిల్స్ తీయడం అత్యంత కష్టమైందని తెలిపాడు. నకుల్ బాల్స్ తో తమను బాగా ఇబ్బంది పెట్టారని, పవర్ ప్లేలో 30 పరుగులు వెనుకబడిపోయామని ఆయన అన్నాడు. తమతో జరిగిన చివరి టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో ఆ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పాడు. వన్డే, టీ20 సిరీస్‌లలో టీమిండియా షాకిచ్చిందని తెలిపాడు.